భారతదేశం, ఏప్రిల్ 16 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 16, గురువారం అత్యంత కీలకమైన రోజు. గురువారానికి అధిపతి బృహస్పతి (గురువు). జాతకంలో గురు దోషం ఉన్నా లేదా వివాహం కాక ఇబ్బంది పడుతున్నా.. ఈ రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణం అద్భుత ఫలితాలను ఇస్తుంది.

మేష రాశి: వ్యాపారస్తులకు ఈరోజు అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు. మీ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి. ఊహించని ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే, కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండటం ఉత్తమం.

వృషభ రాశి: పెట్టుబడులకు ఇది అనుకూల సమయం. కానీ, ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దు. ఆడంబరాల కోసం ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.

మిథున రాశి: ఈరోజు మీకు ఒక పెద్ద విజయం దక్కబోతోంది. మీలోని ప్రతిభకు గుర్తింపు...