భారతదేశం, జూలై 31 -- Tirupati SIHM Admissions 2026 : ఆతిథ్య రంగానికి (హాస్పిటాలిటీ) ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న వేళ.. ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ (SIHM) మంచి అవకాశం కల్పిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ వివరాలను వెల్లడించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల ఉమ్మడి భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థ, నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను అందిస్తోంది. హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో నైపుణ్యాలను పెంపొందించేలా ఇక్కడ కోర్సులను రూపొందించారు.

కేవలం తరగతి గది విద్యకే పరిమితం కాకుండా, విద్యార్థులకు ప్రాక్...