భారతదేశం, మార్చి 1 -- తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. మార్చి 3వ తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీవారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీని రద్దు చేసింది.

ఇక మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ‌SSD టోకెన్లు ముందురోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయబడవని టీటీడీ వెల్లడించింది. ఇక మార్చి 4వ తేదీ దర్శనానికి సంబంధించిన SSD టోకెన్లను మార్చి 3వ తేదీన జారీ చేస్తారు.

మార్చి 3వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ కారణంగా మార్చి 2వ తేదీన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని టీటీడీ తాజా ప్రకటన ద్వారా కోరింది.

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీన శ్రీవా...