భారతదేశం, ఏప్రిల్ 2 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఏప్రిల్ 13న శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం, ఏప్రిల్ 20న అక్ష‌య తృతీయ‌ ఉంటుందని పేర్కొంది.

* ఏప్రిల్ 13న శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం.

* ఏప్రిల్ 20న అక్ష‌య తృతీయ‌, ప‌ర‌శురామ జ‌యంతి, భృగు మ‌హ‌ర్షి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, శ్రీ‌నివాస దీక్షితుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం

* ఏప్రిల్ 21న అనంతాళ్వాన్ ఉత్స‌వారంభం, శ్రీ శంక‌ర జ‌యంతి.

మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మరో ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడప...