భారతదేశం, ఏప్రిల్ 21 -- Tilak Varma: దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన 'సై' మూవీ అందరికీ తెలిసిందే. ఇందులో క్లైమాక్స్ లో వచ్చే రగ్బీ గేమ్ లో విలన్ జట్టు చేతిలో హీరో టీమ్ చావుదెబ్బలు తింటుంది. కానీ టైమ్ ఔట్ తర్వాత హీరో టీమ్ రెచ్చిపోయి ఆడుతుంది. ఆ టైమ్ ఔట్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అచ్చం అలాగే ఐపీఎల్ 2026లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చెలరేగిపోయాడు.

ఐపీఎల్ 2026లో హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. సోమవారం (రాత్రి) గుజరాత్ టైటాన్స్ తో పోరులో ఈ ముంబయి ఇండియన్స్ ఆటగాడు సెంచరీ బాదేశాడు. వీర విధ్వంసంతో ఐపీఎల్ లో తన ఫస్ట్ సెంచరీ అందుకున్నాడు. కేవలం 45 బాల్స్ లోనే 101 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు.

జీటీతో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. తి...