భారతదేశం, అక్టోబర్ 19 -- ముంబై నగరంలో బాలీవుడ్ తారలపై మళ్లీ తుపాకుల మోత మోగుతోంది. ఆదివారం (అక్టోబర్ 18) రాత్రి జుహు ప్రాంతంలో ప్రముఖ యువ హీరో టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారు లక్ష్యంగా అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో టైగర్ ష్రాఫ్​, ఆయన డ్రైవర్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగా ప్రకటించింది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులకు తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ముంబై పోలీసులు ఈ ఘటనపై వేగంగా దర్యాప్తు ప్రారంభించి నగరవ్యాప్తంగా భద్రతను పెంచారు.

గతంలో 1980, 90ల కాలంలో ముంబై అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్లు హిందీ చిత్ర పరిశ్రమను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి బెదిరింపులు, వసూళ్లు, దాడులకు పాల్పడేవారు. 1997లో మ్యూజిక్ మొఘల్ గుల్షన...