భారతదేశం, నవంబర్ 20 -- Thriller Web Series: ఓటీటీ ప్లాట్‌ఫామ్ లపై క్రైమ్ థ్రిల్లర్స్, కామెడీ, హారర్ జానర్లకు కొదవలేదు. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత పకడ్బందీగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ థ్రిల్లర్లు చాలా అరుదు. అలాంటి ఒక మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ 'జేఎల్ 50' (JL50).

బాలీవుడ్ విలక్షణ నటుడు అభయ్ డియోల్, దిగ్గజ నటులు పంకజ్ కపూర్, పీయూష్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 4 ఎపిసోడ్ల మినీ సిరీస్ ఒక్కసారి చూడటం మొదలుపెడితే క్లైమాక్స్ వరకు స్క్రీన్ నుంచి కళ్లు తిప్పుకోనివ్వదు. ఐఎండీబీ (IMDb)లో 7.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ కథ సీబీఐ ఆఫీసర్ శంతను (అభయ్ డియోల్) చుట్టూ తిరుగుతుంది. పశ్చిమ బెంగాల్‌లోని కొండ ప్రాంతంలో జరిగిన ఒక విమాన ప్ర...