Thriller Web Series: సూపర్ హిట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. మరో కొత్త స్కామ్‌తో.. టీజర్ రిలీజ్
భారతదేశం, నవంబర్ 2 -- Thriller Web Series: ఇండియన్ ఓటీటీ చరిత్రలోనే సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టిన వెబ్ ఫ్రాంచైజ్ 'స్కామ్'. 2020లో వచ్చిన 'స్కామ్ 1992: ద హర్షద్ మెహతా స్టోరీ'తో దేశవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ వెబ్ సిరీస్.. ఆ తర్వాత 'స్కామ్ 2003: ద తేల్గీ స్టోరీ'తో స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు ఈ పాపులర్ ఫ్రాంచైజ్ నుంచి మూడో చాప్టర్ 'స్కామ్ 2010: ద సుబ్రతా రాయ్ స్టోరీ' (Scam 2010) రూపంలో రాబోతోంది.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రముఖ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV), అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, బిర్లా స్టూడియోస్ సంయుక్తంగా 'స్కామ్ 2010' ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశాయి. 'సహారా గ్రూప్' వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ (Subrata Roy) జీవితం, ఆయన చుట్టూ తిరిగిన వేల కోట్ల రూపాయల ఆర్థిక వివాదాల ఆధారంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.