భారతదేశం, సెప్టెంబర్ 24 -- Thriller Movie OTT: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) ఆడియెన్స్ ముందుకు మరో మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని తీసుకొస్తోంది. టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, పవర్ హౌస్ పెర్ఫార్మర్ హుమా ఖురేషి లీడ్ రోల్స్ లో నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'పూజా మేరీ జాన్' నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా జీ5 వేదికగా అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. గురువారం (సెప్టెంబర్ 24) ట్రైలర్ రిలీజ్ చేశారు.

బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య, గర్ల్‌ఫ్రెండ్ అరెస్ట్ చుట్టూ తిరిగే కథలా ఈ పూజా మేరీ జాన్ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఒక రిజెక్షన్, ఊహించని విషాదం, సమాజం అంతా ఒక మహిళను విలన్ గా వేలెత్తి చూపే తీవ్రమైన పరిస్థితుల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ప్రేమలో విఫలమైన తర్వాత ...