భారతదేశం, మార్చి 23 -- కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సందడి రాబోతుంది. ఈ వారం డిజిటల్ స్ట్రీమింగ్ కు కొన్ని క్రేజీ సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాబోతున్న ఈ సినిమాలు, సిరీస్ లు ఏంటో ఇక్కడ తెలుసుకోండి.

తమిళ వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కాట్టాన్' ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది. ఒక పోలీస్ స్టేషన్ ను మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడే ఒక మిస్టరీ కేసు వస్తుంది. ఈ కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మార్చి 27 నుంచి జియోహాట్‌స్టార్‌లో ఈ ఉత్కంఠభరిత చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్న కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ గ్యాంగ్ మళ్లీ కలిశారు. ఆర్మీలో తమ సైనిక సేవ ముగిసిన తర్వాత వీళ్లు 'అరిరాంగ్' అనే ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్ రికార్డింగ్ కోసం వారు లా...