భారతదేశం, ఆగస్టు 6 -- The Paradise Teaser: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ మూవీ టీజర్ ను గురువారం (ఆగస్ట్ 6) సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు. ఊహించినట్లే ఊర మాస్ విజువల్స్ తో టీజర్ నాని అభిమానులకు కిక్కెక్కించేలా ఉంది. జడల్ జమనా షురూ అంటూ వచ్చిన ఈ టీజర్ సినిమా రిలీజ్ డేట్ ను కూడా కన్ఫమ్ చేసింది.

రక్తంతో తడిసిన దేహంతో నాని చెప్పే దిష్టి మంత్రం, వెన్నులో వణుకు పుట్టించే యాక్షన్ ఎపిసోడ్స్ తో వచ్చిన ది ప్యారడైజ్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాను పూర్తిగా షేక్ చేస్తున్నాయి.

'దసరా' లాంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది ప్యారడైజ్' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదల చేసిన 1 నిమిషం 43 సెకన్ల టీజర్ ప్రతి ఫ్రేమ్‌లోనూ డైరెక్టర్ విజన్, రా అండ్ ...