భారతదేశం, సెప్టెంబర్ 21 -- The Paradise Runtime: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ది పారడైజ్' సెన్సార్ ప్రాసెస్ గురించిన అప్‌డేట్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. సెన్సార్ బోర్డు (CBFC) ఈ సినిమాకి ఏకంగా 21 కట్స్ సూచిస్తూ 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ మంజూరు చేసింది.

ది పారడైజ్ సినిమాలో చూపించిన కొన్ని విపరీతమైన వైలెన్స్ సీన్లు, తీవ్రమైన బూతు మాటలు, హీరో క్యారెక్టర్ చేతిపై ఉన్న వివాదాస్పద టాటూపై సెన్సార్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బోర్డు సూచనల మేరకు మేకర్స్ సదరు హింసాత్మక దృశ్యాలను ఎడిట్ చేయడంతో పాటు కొన్ని డైలాగ్స్‌ని మ్యూట్ చేసి, చట్టబద్ధమైన హెచ్చరికల కార్డ్స్ యాడ్ చేయక తప్పలేదు.

కత్తిరింపుల తర్వాత ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్‌ను 174 నిమిషాలు...