భారతదేశం, అక్టోబర్ 18 -- The Paradise OTT: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ రా అండ్ రస్టిక్ మూవీ 'ది ప్యారడైజ్' ఓటీటీ రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. భారీ అంచనాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపై అలరించేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ది ప్యారడైజ్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీ అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇవాళ (అక్టోబర్ 18) నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలైన నాని సినిమా.. నాలుగు వారాల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

ది ప్యా...