భారతదేశం, సెప్టెంబర్ 17 -- The Paradise: నేచురల్ స్టార్ నాని తన మోస్ట్ అవేటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ప్యారడైజ్' చెన్నై ప్రెస్ మీట్‌లో చాలానే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమిళ సినిమా తనకు బైబిల్ లాంటిదని, సౌత్ సినిమాలను మాత్రమే 'పాన్ ఇండియా' అని పిలవడంపై తన అసంతృప్తిని బయటపెట్టి సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రమోషన్లలో భాగంగా తమిళ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నాని.. ఈ సినిమా కేవలం పెద్దవాళ్లకే అని, పిల్లలకు కాదని అన్నారు. అంతేకాదు తమిళ చిత్ర పరిశ్రమపై తనకున్న ప్రేమాభిమానాలను ఓపెన్‌గా పంచుకున్నారు.

ఏదో సినిమా ప్రమోషన్ల కోసం ఈ మాటలు చెప్పడం లేదని నాని స్పష్టం చేశారు. "చెన్నైలో ల్యాండ్ అవ్వగానే నా గత జన్మ బంధం ఏదో ఇక్కడే ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. తమ...