భారతదేశం, సెప్టెంబర్ 22 -- The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది పారడైజ్' గ్రాండ్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారం, నెగెటివ్ ట్రోలింగ్‌పై బెంగళూరు కోర్టు గట్టి షాకిచ్చింది. మూవీ రిలీజ్‌కు ముందే హేట్ కంటెంట్, ఫేక్ రివ్యూలను వ్యాప్తి చేయకుండా స్టే విధిస్తూ సంచలన మధ్యంతర ఇంజంక్షన్ ఆర్డర్ జారీ చేసింది.

'దసరా' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో 'ది పారడైజ్' పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఆగస్టు 6న అఫీషియల్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కొందరు కావాలనే సోషల్ మీడియాలో నెగెటివ్ కంటెంట్ ప్రచారం చేస్తున్నారని నిర్మాతలు గుర్...