భారతదేశం, జూన్ 5 -- The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) పేరు చెబితే చాలు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్సెప్షన్ (Inception), ది డార్క్ నైట్, ఇంటర్‌స్టెల్లార్, రీసెంట్ గా వచ్చి ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టిన ఓపెన్‌హైమర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

ఆయన నుంచి కొత్త సినిమా వస్తుందంటే చాలు థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. ఎప్పటిలాగే ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. కానీ ఆయన తాజా చిత్రం 'ది ఒడిస్సీ' (The Odyssey) విషయంలో జరుగుతున్న రచ్చ మాత్రం మామూలుగా లేదు. అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి.

తాజా హాలీవుడ్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమా టికెట్లు ఈబే (eBay) లాంటి సైట్లలో భారీ ధరకు రీసేల్ కి వచ్చాయి. అక్కడ ఒక్క...