భారతదేశం, ఫిబ్రవరి 27 -- వివాదాస్పద మూవీ 'ది కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన 15 రోజుల స్టేను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' సినిమాకు చట్టపరమైన చిక్కులు తొలగిపోయినట్లే. జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ పి.వి. బాలకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ముందుగా ది కేరళ స్టోరీ 2 సినిమాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బెచు కురియన్ థామస్ (సింగిల్ బెంచ్).. సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాకుండా సెన్సార్ బోర్డు (CBFC) ఛైర్మన్ రెండు వారాల్లోగా ఈ ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించా...