భారతదేశం, సెప్టెంబర్ 14 -- Tharun Bhascker Eesha Rebba: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, హాట్ బ్యూటీ ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌పై నెట్టింట మళ్ళీ పెను తుఫాను మొదలైంది. తరుణ్ భాస్కర్ ఇటీవల ఈషా రెబ్బాతో ఉన్న ఒక క్యూట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఆలస్యం.. అది నిమిషాల్లో వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.

తరుణ్ భాస్కర్ సోమవారం (సెప్టెంబర్ 14) వినాయక చవితి సందర్భంగా పోస్ట్ చేసిన ఈ పిక్ చూసిన వెంటనే ఫ్యాన్స్, మూవీ లవర్స్ కామెంట్స్ సెక్షన్లలో రచ్చ చేయడం ప్రారంభించారు. "మీ ఇద్దరి జోడీ చాలా బాగుంది", "ఆల్రెడీ అఫీషియల్‌గా జంటగా మారారా?", "మీ ఇద్దరికీ కంగ్రాచ్యులేషన్స్!" అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోలో ఈ ఇద్దరూ ట్రెడిషనల్ డ్రెస్ లలో కనిపించగా.. వెనుక గణపయ్యను చూడొచ్చు....