భారతదేశం, ఫిబ్రవరి 27 -- తమిళ సూపర్ స్టార్, తమిళనాడు వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత 27 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న విజయ్ - సంగీత దంపతులు విడిపోతున్నారనే వార్త కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ కలకలం రేపుతోంది. తన భర్త విజయ్ నుంచి విడాకులు కావాలంటూ సంగీత స్వర్ణలింగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సంగీత దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. దళపతి విజయ్ ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. 2021లోనే తనకు ఈ విషయం తెలిసిందని, ఆ బంధాన్ని తెంచుకుంటానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ, అది కొనసాగుతూనే ఉందని ఆమె పేర్కొన్నారు. సదరు నటి విజయ్‌తో కలిసి విదేశీ పర్యటనలు చేయడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి తనను, తన పిల్లలను తీవ్ర అవమానానికి గురిచేశాయని సంగీత ఆవేదన వ్యక్త...