భారతదేశం, మార్చి 11 -- తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై సొంత పార్టీలోని నేతల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతని వ్యక్తిగత జీవితం, భార్య విడాకులు కోరడం, హీరోయిన్ త్రిషతో సంబంధం రూమర్లు హాట్ టాపిక్స్ గా మారాయి. ఇప్పుడు టీవీకే పార్టీ మహిళా నేత రంజన నచ్చియార్ తమ చీఫ్ విజయ్ పై మండిపడింది.

భార్యపై విజయ్ కామెంట్లు

తాజాగా మమల్లపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి దళపతి విజయ్ మాట్లాడాడు. తన వ్యక్తిగత సమస్యల గురించి బాధపడొద్దని, తానే అంతా చూసుకుంటానని విజయ్ చెప్పాడు. ఈ క్రమంలోనే తన భార్య గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆమె అంత విలువైందేమీ కాదని విజయ్ అన్నాడు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలను టీవీకే పార్టీ మహిళా నేత రంజన ప్రశ్నించింది.

మార్పు తెస్తాడని

బీజేపీని వీడి టీవీకేల...