భారతదేశం, మార్చి 18 -- ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 17,18తో పాటు 23వ తేదీల్లో ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో బస్సు ఛార్జీలు అదనంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి టీజీఎస్ఆర్టీసీ ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది.

ప్రయాణికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులను నడుపుతోందని వివరించింది. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ స్వంత గ్రామాలకు చేరుకునేలా ఈ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

టీజీఎస్ఆర్టీసీ వివరణ ప్రకారం... ప్రభుత్వ ఉత్తర్వు (GO) నం.16 (2003) ప్రకారం... డీజిల్, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ప్రత్యేక బస్సుల ఛార్జీలను...