భారతదేశం, మార్చి 1 -- హైదరాబాద్ లోని జంట నగర వాసులకు ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ఈ- మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఇవాళ్టి(మార్చి 1) నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ప్రస్తుతం వేసవి కాలం కావటంతో ఎండలు ముదురుతున్నాయి. ఓవైపు ఉక్కపోత కూడా మొదలైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. అయితే ఉక్కబోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తిరిగే ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గిస్తూ నిర్ణయం ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....