భారతదేశం, మార్చి 21 -- రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో వాహనం రిజిస్ట్రేషన్ పై 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 23వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

ఈ ట్యాక్స్ రద్దు చేయటానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు ఉన్నాయి. చాలా మంది వాహనదారులు ఈ ట్యాక్స్ ను తప్పించుకునేందుకు వారి ఇంట్లోని కుటుంబ సభ్యుల పేర్లపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. తరువాత బీమా క్లెయిమ్‌ల సమయంలో యాజమాన్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక రాష్ట్ర రాష్ట్రంలో జరిగే రిజిస్ట్రేషన్లు కేంద్ర ప్రభుత్వ 'వాహన్‌' పోర్టల్‌ ద్వారా జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనం కూడా వాహన్‌తో అనుసంధానమవుతుంది. ఈ సరికొత్త...