భారతదేశం, డిసెంబర్ 25 -- పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా స్కీమ్ పై ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. గతంలో మాదిరిగా కాకుండా.ఈసారి మరికొన్ని మార్పులు ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.

గతంలో సాగు యోగత్య ఉన్నా రైతు భరోసా స్కీమ్ కింద నిధులు జమ చేశారు. అయితే ఈసారి మాత్రం సాగు చేస్తున్న పంట భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తుమ్మల ప్రకటించారు. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

శాటిలైట్ ఫొటోల క్రీడకరణ పూర్తి చేసి నివేదికను వెంటనే సమర్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నివేదిక వచ్చిన తర్వాతనే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ...