భారతదేశం, జనవరి 28 -- తెలంగాణలో మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది.

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థి.. ఐదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు.

ఆరో తరగతి ప్రవేశాలకు 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలుంటాయి. ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత హాల్ టికెట్లు అందుబా...