భారతదేశం, ఫిబ్రవరి 28 -- రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు.

ప్రస్తుతం తెలంగాణ ఎడ్‌సెట్ ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు అవకాశం కల్పించారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద సాధారణ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఇక ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులకు రూ.550 గా నిర్ణయించారు.

టీజీ ఎడ్‌సెట్ కు దరఖాస్తు చేసుకోవాలంటే. డిగ్రీ పూర్తి అయిన అభ్యర్థులు అర్హులవుతారు. వారి విద్యా అర్హతల ఆధారంగా సంబంధిత సబ్జెక్టును ఎంచుకుంటారు. ఈ ఎగ్జామ్ మొత్తం 150 ...