భారతదేశం, మార్చి 2 -- ఓటీటీలోకి తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డాటరాఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గత వారం స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఉదయభానులాంటి వాళ్లు నటించారు. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాస్తోంది.

జీ5 ఓటీటీలోకి గత శుక్రవారం (ఫిబ్రవరి 27) అడుగుపెట్టిన వెబ్ సిరీస్ డాటరాఫ్ ప్రసాద్‌రావు కనబడుట లేదు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు చాలా రోజుల నుంచే మేకర్స్ మంచి ప్రమోషన్స్ నిర్వహించారు. దీనికితోడు ఇందులోని థ్రిల్లింగ్ కంటెంట్ కూడా బాగా నచ్చడంతో వచ్చీ రాగానే ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో తొలి 75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ నమోదు చేసినట్లు జీ5 వెల్లడించింది.

"75 మిలియన్ స్ట్రీమింగ్ మినట్స...