భారతదేశం, జూలై 1 -- Telugu Web Series: తెలుగు వెబ్ సిరీస్‌లకు క్రమంగా ఆడియెన్స్ నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ఇన్నాళ్లకు ఓ సిరీస్ ను తీసుకొస్తోంది. అది కూడా సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి ఓ బోల్డ్ సబ్జెక్ట్ ను ప్రముఖ టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ లీడ్ రోల్లో తీసుకొస్తుండటం విశేషం. మాకీ పూర్ అనే ఊరు చుట్టూ తిరిగే ఈ సిరీస్ గురువారం (జులై 2) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సూపర్ సుబ్బు పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ సిరీస్ ను ప్రమోట్ చేస్తున్న ఆ ఓటీటీ.. తాజాగా మరొక్క రోజులోనే అంటూ ట్వీట్ చేసింది. "మాకీపూర్ పిలుస్తోంది.. సుబ్బు త్వరలోనే రానున్నాడు" అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

ఒకే ఒక్క రోజులోనే అంటూ సందీప్ కిషన్ పోస్టర్ ను ఈ పోస్ట్ తో షేర్ చేసింది. ఈ వెబ్ సిరీస్ తెలుగుతోపాటు హిందీ, కన్న...