భారతదేశం, సెప్టెంబర్ 15 -- Telugu Web Series: తెలుగులో మరో ఫన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మధ్య ఒరిజినల్ కంటెంట్ తో స్పీడు పెంచుతున్న ఈటీవీ విన్ ఓటీటీయే ఈ సరికొత్త సిరీస్ ను తీసుకురాబోతోంది. స్టార్ కమెడియన్ హర్ష చెముడుతో లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే ఈ సిరీస్ ను నిర్మించగా.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు ఈ టీజర్ ను లాంచ్ చేశారు. రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసి ఈ టీజర్ తీసుకొచ్చారు.

తాజాగా విడుదలైన 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. బ్యాచిలర్ లైఫ్‌లో ఎదురయ్యే వింత పరిస్థితులు, ఆఫీస్ వర్క్ ప్రెజర్, సహోద్యోగుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ఫన్నీ సీన్లతో ఈ టీజర్‌ను చాలా కలర్‌ఫుల్‌గా కట్ చేశారు.

"బ్యాచిలర్ లైఫ్.. ఆఫీస్ డ్రామా.. అన్‌లిమిటెడ్...