భారతదేశం, నవంబర్ 19 -- Telugu Web Series: ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్న రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ మెల్‌బోర్న్ మేట్స్ గ్లింప్స్ వీడియో గురువారం (నవంబర్ 19) రిలీజైంది. కేవలం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సూపర్ ఫన్నీగా సాగిపోయింది. గ్లింప్స్ వీడియోలో చివర్లో ఈ దెబ్బతో రాజమౌళి ఔట్ అనే డైలాగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కౌశిక్ ఘంటసాల, అభిజ్ఞ వూతలూరు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఒకే ఇంట్లో ఉండే నలుగురు స్నేహితుల జీవితాలను ఆవిష్కరించనుంది. నవంబర్ 30 నుంచి ఈ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

వెల్కమ్ టు మెల్‌బోర్న్ అనే వాయిస్ తో ఈ గ్లింప్స్ వీడియో మొదలైంది. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కపుల్ లిప్ లాక్ చేసుకుంటూ ఉంటే ఓ అబ్బాయి వాళ్లనే చూస్తూ ఉండటం, పక్కనే ఉన్న అమ్మా...