భారతదేశం, అక్టోబర్ 7 -- Telugu Thriller Web Series: 'కొత్త బంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లో కల్ట్ క్రేజ్ సొంతం చేసుకున్న వరుణ్ సందేష్, శ్వేతా బసు ప్రసాద్ దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'నా వైఫ్ మిస్సింగ్' (Naa Wife Missing) టీజర్‌ను మేకర్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఆహా (Aha) ప్రెజెంట్ చేస్తున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ అక్టోబర్ 22 నుంచి తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు 24 గంటల ముందే అందుబాటులోకి వస్తుంది.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో 2008లో వచ్చిన 'కొత్త బంగారు లోకం'లో బాబు, స్వప్న క్యారెక్టర్లతో యూత్‌ను పిచ్చెక్కించిన వరుణ్ సందేష్, శ్వేతా బసు కాంబినేషన్ మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అవ్వడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా రిలీజైన 'నా వైఫ్ మిస్సింగ్' ట...