భారతదేశం, మే 8 -- Telugu OTT: గుంజి గుంజి అంటూ స్టేజ్ పైనే బూతు పాట పాడి దుమారం రేపిన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా. ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి మూడు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ అయింది.

బుల్లితెర మెగాస్టార్ గా పేరుగాంచిన ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తెలుగు సినిమాలో తనకు తాను యాటిట్యూడ్ స్టార్ గా చెప్పుకుంటాడు. అతడు నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. శుక్రవారం (మే 8) నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సడెన్ గా ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. అది కూడా థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఇలా రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

టాలీవుడ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీగ...