భారతదేశం, నవంబర్ 11 -- Telugu OTT: థియేటర్లలో యూత్‌ను అలరించిన 'క్రేజీ కళ్యాణం' ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని నవంబర్ 13, 2026న ఓటీటీలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రీజినల్ డిజిటల్ దిగ్గజం 'ఆహా'తో పాటు 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

ఇప్పటికే 'ఆహా' ప్లాట్‌ఫామ్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా "క్రేజీ కళ్యాణం త్వరలోనే మీ ముందుకు" అంటూ ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ను టీజ్ చేసింది. డేట్‌పై అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఇప్పుడిక ప్రైమ్ వీడియోలోనూ ఈ మూవీ వస్తుందని అంటున్నారు.

ఆరో సినిమాస్ బ్యానర్‌పై బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన క్రేజీ కళ్యాణం చిత్రంతో భద్రప్ప గాజుల దర్శకుడిగా పరిచయమయ్యారు. పెళ్లి నేపథ్యంతో స...