భారతదేశం, జూలై 29 -- Telangana Weather Updates : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

తాజా బులెటిన్ ప్రకారం... రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఈ వర్షాలు కురుస్తాయి. జూలై 29 నుంచి జూలై 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.

జూలై 31 ...