భారతదేశం, ఫిబ్రవరి 13 -- పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉగాది పండుగ రోజున ఈ హాస్పిటల్‌ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని సర్కార్ నిర్ణయించింది.

ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్‌మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి, హాస్పిటల్‌ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఆఫీస్‌లో టిమ్స్ సనత్‌నగర్ పనుల పురోగతి, డాక్టర్లు, సిబ్బంది నియామకంపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపీ రూమ్‌లు, డయాగ్నస్టిక్స్‌, ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్లు, వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల...