భారతదేశం, మార్చి 3 -- జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ.. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ నిర్ణయం తీసుకున్నారు. విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన తెలంగాణలోని జిల్లా ఆసుపత్రులలో వైఫల్యాలను హైలైట్ చేస్తుందని పలువురు విమర్శలు చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాళ్లోకి వెళ్తే.. భీమేష్ అనే వ్యక్తి ఒక రోజు ఉదయం నాగసాల గ్రామంలోని తన ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కొన్ని రోజుల తర్వాత అతని మృతదేహం జడ్చర్ల మండలంలోని ఒక చెరువు నుండి బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తర్వాత అతడి మృతదేహం మార్చురీకి తరలించారు.

అయితే జడ్చర్ల ఏరియా ఆసుపత్రి మార్చురీ సిబ్బంది మృత...