భారతదేశం, మే 11 -- Tanikella Bharani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, అద్భుతమైన రచయితగా పేరు పొందిన తనికెళ్ళ భరణి తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో మోదీని కలిసిన అనంతరం ఆయన తన మనసులోని మాటలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అత్యంత లోతైన అర్థంతో, ఆధ్యాత్మికతతో కూడిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేవలం ఒక రాజకీయ నాయకుడిని కలిశానన్న భావన కాకుండా, ఒక గొప్ప శక్తిని దర్శించుకున్నాననే అర్థం వచ్చేలా ఆయన తన అభిప్రాయాలను రాసుకొచ్చారు.

తనికెళ్ళ భరణి తన పోస్ట్‌లో పురాణ పురుషులను, భారతీయ తత్వవేత్తలను ప్రస్తావించారు. "నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. నిజానికి మనం వారిని ఇప్పుడు చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోదీ గారిని...