భారతదేశం, నవంబర్ 14 -- Tamil Thriller Anbil Avan OTT: అశోక్ సెల్వన్, ప్రీతి ముకుందన్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'అన్బిల్ అవన్' (Anbil Avan) ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) వేదికగా ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టిన ఈ చిత్రాన్ని మీరు ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదో చెప్పే 5 ప్రధాన కారణాలు ఇక్కడ చూద్దాం.

'అన్బిల్ అవన్' చిత్రానికి అతిపెద్ద బలం హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ ప్రీతి ముకుందన్ ల యాక్టింగ్. కొత్తగా పెళ్లైన సూర్య, ఇయల్ అనే క్యూట్ కపుల్ గా వీరు నటించారు. పెళ్లైన కొత్త జంట మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్స్ ను నేచురల్ గా పండించారు. ఫస్ట్ హాఫ్ లో వీరి రొమాంటిక్ ట్రాక్ యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.

స్టార్ట...