భారతదేశం, మే 12 -- Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. మంగళవారం (మే 12) తెల్లవారుజామున మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ మహాకాలేశ్వర ఆలయాన్ని ఆమె సందర్శించారు. ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే 'భస్మ హారతి' సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
సాధారణంగా మహాకాలేశ్వర ఆలయంలో తెల్లవారుజామున జరిగే భస్మ హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తమన్నా తన ఆప్తమిత్రురాలు, నిర్మాత ప్రగ్యా కపూర్‌తో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, భక్తిశ్రద్ధలతో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. హారతి అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా తమన్నా మీడియాతో మాట్లాడుతూ.. "దేవుడి పిలుపు ఉంటేనే ఈ క్షేత్రానికి రాగలం. ఈ రోజు భస్మ హారతిని కళ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.