భారతదేశం, జూన్ 1 -- Taapsee Pannu: సోషల్ మీడియా యుగంలో పర్‌ఫెక్ట్ బాడీ షేప్‌తో, ముఖ్యంగా 'ఫ్లాట్ బెల్లీ' (సన్నని నడుము) తో కనిపించాలనే ఒత్తిడి సెలబ్రిటీలకే కాదు, సామాన్య అమ్మాయిలకూ ఎక్కువే ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది కఠినమైన డైట్లు, మితిమీరిన వర్కవుట్లతో తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. తాజాగా దీనిపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చే'సింది.

ఒకప్పుడు పర్‌ఫెక్ట్ బాడీ ఇమేజ్ కోసం తానూ శరీరాన్ని విపరీతంగా హింసించుకున్నానని, ఆ తప్పును అభిమానులు ఎవరూ చేయవద్దని తాప్సీ వార్నింగ్ ఇచ్చింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫోటోల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడొద్దని హితవు పలికింది.

"చిన్నప్పటి నుంచి నేను చాలా ఫిట్‌గా ఉండేదాన్ని. కానీ లోయర్ బెల్లీ ఫ్యాట్ ఎందుకు అలాగే ఉండిపోతుందో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. దానిని కరిగించ...