భారతదేశం, సెప్టెంబర్ 4 -- Taapsee Pannu: ఇటీవల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన రామ్ చరణ్ 'పెద్ది', కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'టాక్సిక్' చిత్రాల్లో హీరోయిన్లను చూపించిన విధానంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. సినిమాల్లో స్త్రీలను కేవలం గ్లామర్ బొమ్మలుగా, ఆబ్జెక్టిఫై చేస్తూ చూపించడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై తాప్సీ పన్ను రియాక్టయింది.

తాప్సీ లీడ్ రోల్ ప్లే చేసిన గాంధారి మూవీ డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ సంచలన కామెంట్లు చేసింది. సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానంపై అడిగిన ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో కనిపించే డిజిటల్ ప్రపంచం వేరు, గ్రౌండ్ లెవల్ లో ఉండే నిజ ప్రపంచం వేరు. ముఖ్యంగా మాస్ సినిమాలపై సోషల్ మీడియాలో వచ్...