భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఒక్క ఓటమి.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియాను డేంజర్ జోన్లో పడేసింది. టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసును క్లిష్టంగా మార్చింది. సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో దారుణ ఓటమి భారత అవకాశాలను గట్టిగానే దెబ్బతీసింది. అయితే ఇంకా ఇండియాకు ఛాన్స్ ఉంది. సెమీస్ చేసే మార్గం ఉంది. కానీ అందుకు భారత్ అత్యుత్తమంగా ఆడాల్సిందే.

టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ కు సూపర్ 8 స్టేజీలో ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి. జింబాబ్వే, వెస్టిండీస్ తో ఇండియా ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వే వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతుంది. ఈ పోరులో భారత్ కచ్చితంగా గెలవాల్సిందే. ఇది డూ ఆర్ డై మ్యాచ్.

గ్రూప్ స్టేజీలో ఇండియా వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచింది. కానీ సూపర్ 8కు రాగానే సౌతాఫ్రికా చేతిలో ఓడింది. ఈ నేపథ్యంలో భారత్ ప్లాన్ బి అమలు చేయాలని క్రికెట్ పండితులు వ...