భారతదేశం, మార్చి 4 -- టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా సెమీస్ కు రెడీ అవుతోంది. గురువారం (మార్చి 5) సెమీస్ లో ఇంగ్లాండ్ ను ఢీ కొడుతుంది. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ మ్యాచ్ పైనే ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించాల్సి వస్తే రింకు సింగ్ ను ఫైనల్ ఎలెవన్ లో ఆడించాలని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సూచించాడు.

టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ ఫామ్ అంతంతమాత్రంగానే ఉంది. ఈ విధ్వంసక ఓపెనర్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఈ టోర్నీలో అతను ఆడిన ఫస్ట్ మూడు మ్యాచ్ ల్లో డకౌట్ అయ్యాడు. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ బాదాడు. కానీ వెస్టిండీస్ తో కీలకమైన పోరులో మాత్రం మళ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ టీ20 ప్రపంచకప్ లో అభిషేక్ శర్మ 6 ఇన్నింగ్స్ ల్లో కలిపి 80 పరుగులు మాత్రమే చేశాడు.

అభిషేక్ ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే ఇంగ్లాండ్ తో సెమీస్ లో అతణ్ని జట్టు ను...