భారతదేశం, ఆగస్టు 15 -- SYG Release Date: సంక్రాంతి పండుగ సీజన్ టాలీవుడ్‌లో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ విండో. ఈ సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది. 2027 సంక్రాంతి రేసులోకి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ దిగుతున్నాడు. అతని 'సంబరాల ఏటి గట్టు' మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించేశారు.

సాయి ధరమ్ తేజ్ హీరోగా చాలా కాలం నుంచి తెరకెక్కుతున్న మూవీ 'సంబరాల ఏటి గట్టు'. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెగా అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సినిమాను జనవరి 12, 2027న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

సంబరాల ఏటి గట్టు మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ హీరో సాయి ధరమ్ తేజ్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో కత్తి పట్టుకుని, బట్టలపై రక్తంతో కనిపించాడు సాయి ధరమ్ తేజ్. భారీ య...