భారతదేశం, మే 2 -- Swara Bhasker: ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న అనవసరపు విమర్శలు, బాడీ-షేమింగ్ (body shaming) పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ ఇమేజ్ ఉన్న మహిళల శరీరం గురించి వచ్చే అబద్ధమైన విషయాలను తప్పుబట్టింది. 2023లో కుమార్తె రాబియా జన్మించిన తర్వాత, తన శరీరంలో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది.

స్వర భాస్కర్ ఇటీవల తన 2018 నాటి ఫోటోను ఒకటి షేర్ చేసింది. దానిపై కొందరు నెటిజన్లు తీవ్రమైన బాడీ-షేమింగ్ కామెంట్లు చేశారు. మే 1న స్వర తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అలాంటి ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను పంచుకుంది.

అందులో.. "నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? నువ్వు అసలు అంత మంచి నటివా?. ఎందుకో తెలియదు'' అని ఉంది. దీనికి స్వర భాస్కర్ స్పందిస్తూ.. "ఇలాంటి మెసేజ్ లు పంపేవారికి తమపై ఎలాం...