భారతదేశం, జూన్ 26 -- ప్రతి ఒక్కరూ నిద్రపోయినప్పుడు కలలు కంటూ ఉంటారు. కొన్ని కలలు మనకు గుర్తుంటాయి, కానీ కొన్ని కలలను మర్చిపోతూ ఉంటాం. అయితే ఈ కలల ప్రపంచం ఎప్పుడూ రహస్యమయం, ఆసక్తికరంగానే ఉంటుంది. నిద్రలో చాలా రకాల దృశ్యాలు కనిపిస్తాయి. మరణించిన మన ప్రియమైన వారు లేదా బంధువులు కలలో కనపడితే మంచిదా, కాదా? దాని వల్ల నష్టాలు కలుగుతాయా, లాభాలు కలుగుతాయా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్న శాస్త్రం ప్రకారం మరణించిన వారు కలలో కనపడితే అది యాదృచ్ఛికం మాత్రమే కాదు. దానికి ఆధ్యాత్మిక, భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలు ఉంటాయి. వారు కలలో వివిధ రూపాల్లో కనపడితే వాటి అర్థం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

చనిపోయిన పూర్వీకులు లేదా బంధువులు ఎవరైనా కలలో ఆరోగ్యంగా, సంతోషంగా, నవ్వుతూ కనపడితే చాలా మంచిది. వారి ఆత్మ ప్రశాంతంగా ఉందని, పరలోకంలో మంచి స్థానం లభించిందన...