భారతదేశం, ఏప్రిల్ 17 -- Suyodhana OTT: తెలుగు మిస్టరీ థ్రిల్లర్ 'సుయోధన' మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 17) సుయోధన మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. ఇదో డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ.

ప్రియదర్శి, సీనియర్ నటుడు సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన మూవీ 'సుయోధన'. ఇదో మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సడెన్ గా స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ సర్ ప్రైజ్ చేసింది.

సుయోధన మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, ప్రియదర్శితో పాటు ప్రేమ, ద్రిషిక చందర్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి వైఎస్ మాధవ్ రెడ్డి డ...