భారతదేశం, నవంబర్ 12 -- Suspense Thriller OTT: ఇండియన్ ఓటీటీ లవర్స్ కు ఎంతో చేరువైన జియోహాట్‌స్టార్‌ వరుసగా స్పెషల్ వెబ్ సిరీస్ లతో ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో తర్వాత వెబ్ సిరీస్ లే ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇప్పుడా జోష్ ను మరింత పెంచడానికి 'పుష్పక విమానం' వెబ్ సిరీస్ వచ్చేసింది.

అలనాటి కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ నుంచి ఈ జనరేషన్ లో ఆనంద్ దేవరకొండ మూవీ వరకు 'పుష్పక విమానం' పేరుతో సినిమాలు వచ్చాయి. కానీ జియోహాట్‌స్టార్‌లోకి ఇవాళ (నవంబర్ 12) పుష్పక విమానం పేరుతో వెబ్ సిరీస్ రిలీజైంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ తెలుగు వెబ్ సిరీస్ తెరకెక్కింది. అయిదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

టైమ్ ట్రావెల్ స్టోరీతో నడిచే సినిమాలు లేదా సిరీస్ లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కాన్సెప...