భారతదేశం, ఏప్రిల్ 3 -- ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు జోరు కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ముంబై జట్టు.. శనివారం (ఏప్రిల్ 4) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరగనున్న పోరుకు సిద్ధమవుతోంది. అయితే మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ముంబై ఆటగాళ్లు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar)లోని అక్షయ్ ఖన్నా వైరల్ స్టెప్పును రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ముంబై ఇండియన్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో సూర్యకుమార్ యాదవ్ తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీశారు. "ఇది దాదా స్టైల్.. ఫుల్ ధురంధర్ మోడ్" అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఫ్లిప్పరాచీకి చెందిన 'FA9LA' సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవు...