భారతదేశం, ఆగస్టు 12 -- Suriya: కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో సూర్య, వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath and Sons). 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో సూర్య కామెంట్స్ వైరల్ గా మారాయి.

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ దర్శకుడు వెంకీ అట్లూరి మేకింగ్ విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

"దుల్కర్ సల్మాన్‌తో వెంకీ తీసిన 'లక్కీ భాస్కర్' సినిమా చూసిన తర్వాత నాకు చాలా నచ్చింది. ఆ వెంటనే వెంకీ దర్శకత్వంలో ఎలాగైనా ఒక సినిమా చేయాలని మనసులో బలంగా అనుకున్నాను'' అని సూర్య తెలిపారు.

''నా కోరిక దేవుడు విన్నాడేమో.. వెంటనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ఫో...